అరవై నాలుగు గడుల అరుదైన
అద్భుత ఆట చదరంగం.
ఇద్దరు ఎదురెదురుగా ఆడే ఆట.
నలుపు తెలుపుల నరులాట.
చదరంగం (చెస్)ఆటలో
కస్సు, బుస్సులు, కొట్లాటలు ఉండవు.
సైన్యం ఉంటుంది కానీ ముట్టడి ఉండదు.
కరి(కరులు) ఘీంకరించి ఏమనదు(వు).
గుర్రాలు గుర్రుపెట్టవు..
శకటం మకుటమే.
ఎత్తుకు పై ఎత్తులు వెయ్యడం.
రాజును కట్టడి చెయ్యడమే.
శక్తితో కాకుండా యుక్తితో ఆడే ఆట.
ఆటలో ఎవరో ఒకరు చిత్తు.
గెలిచినవారిదే సొత్తు.
ఆడితే గమ్మత్తు.
మేధతో ప్రత్యర్థిని మట్టికరిపించే
మేలైన, మేటైన "మేధావుల ఆట"
"చదరంగం".

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి