ఆరోగ్య రక్షణకు దివ్వౌషధము:- అంకాల సోమయ్య -దేవరుప్పుల - జనగామ -9640748497
మౌనం అర్థాంగీకారమా
మన అత్యంత గోప్యతకు
మూలకారణమా !?
కాల పరీక్షలకు కొన్నింటా
 విజయకేతనపు చిహ్నమే!?

మౌనం అంతరంగ మాలిన్యమును
శుద్ధిచేయు వడపోతవస్త్రము!
మౌనం ఆత్మావలోకనపు
విశ్వజనీన భావనా!? 
బ్రేకప్ ప్రేమలు మౌనం వీడితే
ఉప్పైనైన కన్నీటిప్రవాహమే

మౌనం వ్రతమే ఆత్మబలానికి
అచేతనత్వంనుండి చేతనత్వానికి
జడపదార్థాలు జగజ్జేతలవడానికి
మౌనమే సింహద్వారము
మధ్యతరగతి మనుషుల 
మందహాసము 
పేదలను వరించని ఒకే ఒక 
భావోద్వేగము

ఆరోగ్యరక్షణకు దివ్వౌషధము
ఆవేశకావేశాల ముందరి కాళ్ళకు బంధము
మౌనము మానవ కోటికి
ఒక వరము!
ప్రతి హృదిలో అంకురించే
ఓ స్నేహబీజము
సతతం మన వెంట ఉంటే
సమస్యాపూరణ మంత్రము
మౌనంతో సహజీవనం 
మహితలపు భోగభాగ్యం



కామెంట్‌లు