దశావతారాలలో ఒకటైన కృష్ణావతారం ప్రేమతత్వానికి ప్రతీక
బాల్యంలో చిన్నికృష్ణుని లీలలు వెన్నదొంగ తనం గోపీకా వస్త్రపహరణం,
యశోదమ్మ మన్నుతిన్నావని నోరుతెరువ మన్నప్పుడు
విశ్వాన్ని చూపించి ఆశ్చర్యానికి గురిచేయడం
ఎన్నో ఎన్నెన్నో లీలలు
ఎన్నిసార్లు చదివిన చదవాలని పించే కృష్ణలీలలు.......!!
బాల్య స్నేహితుడు నిరుపేద బ్రాహ్మణుడు కుచేలుని మరువక ఆర్తితో వచ్చిన స్నేహితుని పాదచరణములను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయిన పత్ని రుక్మిణి సహాయం తో కడిగి నెత్తిన నీరు జల్లుకొని స్నేహితుని కండువాలోని మూటవిప్పి పిడికెడు అటుకులు స్వీకరించిన తోడనే అష్టైశ్వర్యాలు ప్రసాదించిన ప్రేమముర్తి స్నేహబంధానికి నిలువెత్తు దర్పణం కృష్ణపరమాత్మ.......!!
జయదేవుని అష్టపదులలో రాధాకృష్ణుల ప్రేమ, గోపికల విరహవేదన జీవాత్మ పరమాత్మల మధ్య గల సంబంధానికి ప్రతీకలు అలౌకిక ప్రేమ కు సంకేతాలు. భగవద్గీత వసుదైవ కుటుంబానికే ప్రామాణీక గ్రంధం, జాతిపిత మహాత్మాగాంధీ, స్వామి వివేకానందలు అన్ని సమస్యలు పోగొట్టే ఏకైక గ్రంధం అని చెప్పుట దాని ఔన్నత్యాన్ని తెలియచేస్తునాది.
కావున కృష్ణతత్వం ప్రేమతత్వానికి ప్రతీక...!!
...............................
లోకా సమస్తా సుఖినో భవంతు.
...............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి