భారతీయ సంస్కృతి సంప్రదాయలకు మూలపురుషుడు వేదవ్యాసుడు. అష్టాదశ పురాణములను, మహాభారత,భాగవత గ్రంథాలను మనకందించిన మహనీయులు.
పరాశర, సత్యవతిల తనయుడే కృష్ణద్వైపాయనుడు. మానవ మనుగడకు ఆధారమైన వేదములను నాలుగు భాగములుగా విభజించి వాటికి ఋగ్వేదము,యజుర్వేదము సామవేదము,అదర్వణ వేదము అని నాలుగు వేదములుగా విభజించుట
వలన వేదవ్యాసుడుగా ప్రసిద్ధిచెందినాడు. వేదాలను తనశిష్యులైన శుక, జైమిని, వైశంపాయన, పైల,సుమంతుల ద్వారా సమాజానికి తెలియచేసిన ఆదర్శనీయులు వ్యాసమహర్షి.
వ్యాసభగవానుడు మహాభారతం వ్రాయడానికి విఘ్నాధిపతి గణేశుడు తన దంతమును తీసి వ్రాయుటచే ఏకదంతుడయ్యాడని ప్రసిద్ధి. మహాభారతానికి జయకావ్యమనే పేరుంది.
ఇందులో జీవన్ముక్తికి సోపానాలైన' విష్ణుసహస్ర నామం, భగవద్గీత' ఉన్నాయి. వ్యాసమహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తియే
అందుకే' వ్యాసాయ విష్ణురూపాయ' అంటారు.
బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు మూడింటిని కలిపి 'ప్రస్థానత్రయం 'అంటారు వీటిని మనకందించినది వ్యాసుడే
అందుకే వ్యాస భగవానుడని అంటారు.
బౌద్ధ వాజ్ఞ్మయం లో కూడా వ్యాసులవారి ప్రస్థావన ఉన్నది. సిక్కుల పవిత్ర గ్రంథములో కూడా వారి మతగురువు గురుగోవింద్ సింగ్ వ్యాసుడు బ్రహ్మ దేముని ప్రతిరూపమే అని వర్ణించారు. పతంజలి యోగశాస్త్రమునకు ఆధారం వ్యాసభగవానుని మహాభాష్యమే.
వేదములు భారతావని కే కాదు జర్మనీ వంటి పాశ్చాత్య దేశాలకు కూడా ప్రామాణికం.వేదాలలో లేని విషయం ఎక్కడా లేదని మల్లాది, చాగంటి, గరికపాటి ప్రవచనకారులు చెప్పినది యథార్థమన్నది అన్యదేశస్థులు కూడా అంగీకరించడాన్ని చూస్తే వేదవ్యాసుడు సాక్షాత్తు భగవంతుడే.వారు జన్మించిన ఆషాఢ పౌర్ణమి (వ్యాసపౌర్ణమి) గురు పౌర్ణమి గా సనాతన సంప్రదాయం ప్రకారం భారతదేశములోనే గాకుండా ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలు అనేక దేశాలలో జరపడం భరతావనికే గర్వకారణం..!
.................................
గురుపౌర్ణమి విశిష్టత:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి)-విశాఖపట్నం.-9963265762.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి