అమూల్యమైన అక్షరాలు:- --గద్వాల సోమన్న, 996641458
నేర్చుకో అక్షరాలు
మార్చుకో తలరాతలు
అజ్ఞానము తొలగితే
బాగుపడును జీవితాలు

విలువైన అక్షరాలు
అభివృద్ధి సోపానాలు
ఈ సభ్య సమాజంలో 
పెంచునోయ్ మర్యాదలు

తరుమునోయ్ దారిద్ర్యము
పోగొట్టునోయ్ దాస్యము
అక్షరాలు నమ్మితే
ఎక్కించును అందలము

అక్షరాలు మహోన్నతము
వెలిగించును జీవితము
అసమానతలు పోగొట్టి
వృద్ధి చేయు సంస్కారము


కామెంట్‌లు