పెద్ద మనిషి హితోక్తులు:- --గద్వాల సోమన్న, 9966414580
గాలిలోన దీపము
పెట్టుకుంటే నష్టము
చేతులతో దానికి
కాపునిస్తే లాభము

నీటి మీద రాతలు
వదరుబోతు మాటలు
నిర్మిస్తే నిలవవు
ఆకాశ హార్మాలు

పనికిరాని కూతలు
నీచమైన చేతలు
హానికరం పరికింప
చెదరగొట్టు తలపులు

దుష్టులతో స్నేహము
అత్యంత ప్రమాదము
సజ్జనుల సహవాసము
బ్రతుకున మధుమాసము

అధికమైన కోపము
తెచ్చునోయ్ అనర్ధము
జీవితాన శాంతము
తలపించును నాకము

పెంచుకోకు ద్వేషము
ఆదిలోన త్రుంచుము
చేయబోకు పాపము
చివరికదే దాస్యము


కామెంట్‌లు