వినయమే ఆభరణం:- --గద్వాల సోమన్న, 9966414580
హెచ్చితే అహంకారము
ఆవరించు అంధకారము
నియంత్రణ లేకపోతే
బ్రతుకగును అతి దారుణము

క్షీణించును బంధాలు
వర్ధిల్లవు స్నేహాలు
వినయమే కంఠహారము
తెలుసుకొమ్ము ఈ సత్యము

గర్వంతో నాశనము
పాడగును ఆరోగ్యము
విజయానికి సోపానము
అమూల్యమైన వినయము

ఆదిలోనే వదిలేస్తే
వినయాన్ని వెంబడిస్తే
జీవితమే సుఖాంతము
తొంగిచూచును ఆనందము


కామెంట్‌లు