అక్షరాల ఆకాంక్ష:- --గద్వాల సోమన్న, 9966414580
చింత లేని లోకాన
కాంతులీను మార్గాన
ఉండాలని ఉందోయ్
ఆనంద తీరాన

స్వచ్ఛమైన హృదయాన
స్వేచ్ఛ ఉన్న గగనాన
ఉండాలని ఉందోయ్
మంచి ఉన్న నగరాన

పరిమళించు తోటలో
కన్నవారి మాటలో
ఉండాలని ఉందోయ్
మమకారపు కోటలో

కన్నవారి ఆశల్లో
వారి కలల శ్వాసల్లో
ఉండాలని ఉందోయ్
పేదోళ్ల గుండెల్లో


కామెంట్‌లు