టీచర్ హితోక్తులు:- --గద్వాల సోమన్న, 9966414580
మితిమీరిన బద్ధకము
చేస్తుందోయ్ నాశనము
ఆదిలోన త్రుంచితే
తప్పుతుంది ప్రమాదము

నిప్పులాంటిది కోపము
కలుగజేయు అనర్ధము
క్రమేణా తరిమికొట్టు
ప్రపంచమే జైకొట్టు

చేయరాదు దౌర్జన్యము
ఆవరించు దౌర్భాగ్యము
చేతనైతే సాయము
చేసిపెట్టు నిరంతరము

దుర్గుణమే యమపాశము
చెల్లించాలోయ్ మూల్యము
మానుకుంటే మంచిది
బాగుపడును జీవితము


కామెంట్‌లు