పచ్చదనం పెంచాలి!:- --గద్వాల సోమన్న, 9966414580
ఉంటేనే పచ్చదనము
ఉర్విలోన చక్కదనము
చేయునోయి కనువిందు
మేలులెన్నో కలవు అందు

పచ్చదనము, పరిశుభ్రత
మన అందరి బాధ్యత
 పూనుకొమ్ము ఇకనైనా
కానిమ్ము  ఏమైనా

పచ్చదనం ఉంటేనే
కళకళలాడును లోకము
లేదంటే తలపించును
సహారా ఎడారి ప్రాంతము

పెంచాలోయ్ పచ్చదనము
పదిమందికి అరోగ్యము
ఎద ఎదలో ఆహ్లాదము
అంతులేని ఆనందము


కామెంట్‌లు