చిరు నవ్వుల తొలకరి:- --గద్వాల సోమన్న, 9966414580
చిరు నవ్వుల చినుకుల్లో
రోజు రోజు తడవాలి
అవి రువ్వే సొగసుల్లో
దివ్యంగా వెలగాలి 

పదిమందిని నవ్విస్తూ
ఆయుష్షును పెంచాలి
అనారోగ్యం తరిమేస్తూ
ఆరోగ్యం పంచాలి

ఒక వరం దరహాసము
జీవితాన మధుమాసము
నవ్వు విరియని ముఖములు
చమురు లేని దీపములు

ఖర్చు లేనివి నవ్వులు
గుబాళించే పువ్వులు
పోయేది ఏమీ లేదు
నవ్వు లేక వెలుగురాదు
వదన వనములు తావులు


కామెంట్‌లు