ఉండాలోయ్!:- --గద్వాల సోమన్న, 9966414580
పాలలోని తెలుపులా
పూలలోని తావిలా
ఉండాలోయ్! జగతిలో
మాలలోని సొగసులా

తోటలోని మల్లెలా
నోటిలోని మాటలా
ఉండాలోయ్! బ్రతుకులో
కోటలోని రాజులా

తరువులోని ఫలంలా
చెరువులోని జలంలా
ఉండాలోయ్! వసుధలో
గురువులోని తెలివిలా

పంటనిచ్చు పొలంలా
పొలం దున్ను హలంలా
ఉండాలోయ్! ఉర్విలో
నిగ్గు తేల్చు కలంలా


కామెంట్‌లు