గుండవెళ్ళి గ్రామంలో రత్నాలు అనే వృద్ధుడు ఉండేవాడు. వయసు తొంబై యేండ్లపైగా ఉన్నా కట్టే పట్టుకొని ఊరంతా తిరిగేవాడు. ఏం రత్నాలు తాత ఇంత పెద్ద వయస్సున్న నిమ్మలంగా సన్నగా సలాకలా కర్ర పట్టుకుని నడుచుకుంటూ ఊరంతా తిరుగుతావు. ఏంటి నీ రహస్యం అని జనం అనేవారు. ఏముందోయ్! మీలాగా అడ్డమైనవి అరవై రకాలు తిని బొర్ర పెంచుకుంటే ఎట్లా నడువస్తదంటూ బదులిచ్చేవాడు.
రత్నాలు తాత బయటకు వెళ్లాడంటే చాలు అందరూ ఇవే ప్రశ్నలు అడిగి అడిగి ఇబ్బంది పెట్టేవారు. అయినా రత్నాలు తాత నవ్వుతూ అరుగులపై కూర్చునేవాడు. ఒకరోజు సెలవు రోజు యువకులందరూ బాగా దావత్ చేసుకుని, కడుపునిండా తిని కదలకుండా ఆయాసపడుతూ కూర్చున్నారు. వారిని చూడగానే రత్నాలు తాతకు ఒళ్లంతామండింది. వాళ్లలో తన మనుమలు కూడా ఉన్నారు. జల్సాల పేరుతో పొట్ట నింపుకుంటున్న వాళ్ళని చూస్తూ అలాగే నిలబడ్డాడు.
ఏం తాతా మావలే నువ్వు ఎప్పుడైనా దావత్ చేస్తావా ఏంటి. చూడు మా అందరి ఆనందం అంటూ దుంకులాడారు. దుంకి దుంకి అందరూ అలాగే కులబడిపోయారు. అయినా రత్నాలు తాత వాళ్ళను చూస్తూ అలాగే నిల్చున్నాడు. అంతలోనే పాము పాము అంటూ ఒకరు అరవగానే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలో మూలకు చేరారు. పెద్ద నాగుబాము కడప వద్ద చేరి బుసలు కొడుతూ పడుగవిప్పింది. అందరూ గజగజ వణుకుతున్నారు.
రత్నాలు తాత మాత్రం భయపడకుండా కర్రను కిందకొడుతూ టపటప చప్పుడు చేయగానే, ఆ కర్ర చప్పుడుకు ఏదో భయం ఆవరించుకొని పాము నెమ్మదిగా బయట మైదానంలోకి వెళ్లిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. దావత్ సంగతి దేవుడు కెరుక కానీ పాము నుండి కాపాడిన రత్నాలు తాత చుట్టూ చేరారు. దావతులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎలా బయటపడాలో ఉపాయంతో పామును చంపకుండా కర్ర శబ్దంతో వెళ్ళగొట్టినట్లు అన్ని విద్యలు నేర్చుకోవాలని రత్నాలు తాత హితబోధ చేశాడు. అందరూ తాతకు నమస్కరించి తమ ఇండ్లకు వెళ్లారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి