కవ్వంగిరి రాజ్యాన్ని రాజసేతు అనే రాజు పరిపాలిస్తున్నాడు. తన పరిపాలనలో ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. తనకు వృద్ధాప్యం రావడం మూలంగా తన ఇద్దరు కుమారులు చంద్రసేతు, విజయసేతులలో ఒకరికి రాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. బాగా ఆలోచించి వారిద్దరినీ పరీక్షించాలనుకున్నాడు.
ఒకరోజు మహారాజు రాజసేతు కుమారులిద్దరినీ పిలిచి, చెరో పాతిక బండ్ల నిండా ధాన్యం, కొంత ధనము ఇచ్చి, రాజ్యంలో పర్యటించమన్నాడు. ఆరు మాసాల గడువు తెలిపి తిరిగి వచ్చేటప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ధాన్యం, ధనం ఉంటే వారికి రాజ్యం అప్పగిస్తానన్నాడు. చంద్రసేతు, విజయసేతులు పాతిక ధాన్యం బండ్లు, ధనముతో చెరో వైపు వెళ్లారు.
చంద్రసేతు వెళ్లే దారిలో ఆకలితో అలమటిస్తున్న వారికి ధాన్యం అందజేస్తూ, గ్రామాలలో నిద్రిస్తూ, వారికి కొంత ధాన్యం, ధనము ఇస్తూ వారి వద్దనే భోజనం చేస్తూ, రాజ్య పర్యటన చేయసాగారు. కానీ విజయసేతు మాత్రం ప్రజలు ఎవ్వరు కనిపించిన మాట్లాడడమే మానేశాడు. ఎవరిని మాట్లాడించిన ఏదో ఒక సాకు చూపించి తన వద్ద ధాన్యం, ధనము అడుగుతారని, తాను గ్రామాల బయట నిద్రిస్తూ, అప్పుడప్పుడు బాగా ఆకలేసినప్పుడు మాత్రమే తన వద్ద ఉన్న ధాన్యంతోనే వంట చేసుకుని తినేవాడు. ఇలా వీళ్ళ రాజ్య పర్యటన ఆరు మాసాలు సాగింది.
గడువు మూయగానే చంద్రసేతు ఒంటరిగా నడుస్తూ రాజమందిరానికి చేరుకున్నాడు. విజయసేతు ఇరవై బండ్ల ధాన్యం, తీసుకెళ్ళిన ధనం మొత్తంతో చేరుకున్నాడు. చంద్రసేతు పుష్టిగా బలంగా ఉన్నాడు. విజయసేతును బక్క చిక్కిపోయాడు. ఎవరు కూడా గుర్తుపట్టలేదు. ఖాళీ చేతులతో వచ్చిన చంద్రసేతు. తిరిగి ధాన్యం, ధనముతో వచ్చిన విజయసేతులలో ఎవరికి రాజ్యం అప్పగించాలో తండ్రి రాజసేతు మదన పడుతున్నాడు. అమాత్యులందరూ కూడా ధాన్యం, ధనముతో తిరిగి వచ్చిన విజయసేతును రాజుగా ప్రకటించమని సలహా ఇచ్చారు.
కానీ మహారాజు రాజసేతు మాత్రం చంద్రసేతును రాజుగా ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతలోనే వేగులు వచ్చి, మహారాజా! చంద్రసేతు పర్యటించిన ప్రాంతమంతా పచ్చగా పంటలతో నిండి ఉన్నది. విజయసేతు పర్యటించిన ప్రాంతం ఎడారిగా కానవస్తుంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారన్నాడు. మహారాజు రాజసేతు మాట్లాడుతూ విజయసేతు తాను తినక, ప్రజలకు పెట్టక బక్కచిక్కి, రోగిష్టిలా ధాన్యం బస్తాలతో రాజ్య పర్యటన చేస్తే ఏం లాభం. ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలు తెలుసుకుని, సాయపడిన చంద్రసేతు విశాల హృదయం కలవాడని అన్నాడు. అమాత్యులందరూ మహారాజు రాజసేతు దూర దృష్టికి సంతోషించారు. కవ్వంగిరి రాజ్య ప్రజలంతా కూడా తండ్రి వలె విజయసేతు పరిపాలనలో కష్టసుఖాలతో జీవించసాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి