సాహిత్య కెరటాలు కవి కళా పీఠం
సాహితీ కవితలు
=====================
పోరాటాలెన్నో
జీవన సమరంలో...
ఆటంకాలెన్నో
బ్రతుకు బాటలో...
అణువణువునా
ఆకాంక్షలు ఉంటాయి...
ప్రతి అడుగులో
ఆక్షేపణలు ఉంటాయి...
ఆలోచనతో అధిగమించాలి...
ఆత్మస్తైర్యంతో
ముందుకు సాగాలి...
సుదూర తీరాలను
అలవోకగా అందుకోవాలి
సమాజానికి
చేదోడు కావాలి...
అన్నార్తులకు
ఆలంబన కావాలి....
అన్యాయాలకు
ఎదురొడ్డి నిలవాలి...
ముందు తరాలకు
ఆదర్శం కావాలి...
సమాజ పురోగతికి
వెన్ను దన్ను కావాలి...
ప్రకృతి వనరులను
కాపాడుకోవాలి...
ప్రజా పోరాటాలకు
పిలుపు నివ్వాలి...
ప్రజల హితం కోరాలి...
ప్రజా నాయకుడవై నిలవాలి...
ప్రజల క్షేమం కొరకు


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి