అడవిలో లేడిని ఆడనివ్వండి
తిరిగే దుప్పిని తిరగనివ్వండి
మీరు ఉచ్చలు వాటికి వేసి
వాటి ఉసురులు తీయకండి
అడవిలో తిరిగే జీవులను
హాయిగా తిరగాడనివ్వండి
ప్రకృతి మాత బిడ్డలు అవి
అవనికి దూరం చేయకండి
రెక్కలు విప్పి ఎగిరే పక్షులకు
వలలు వేసి మీరు పట్టకండి
స్వేచ్ఛగా వాటిని వదిలేయండి
ఆకాశాన హాయిగా తిరగనీయండి
నాట్యం చేసే మయూరాలను
కఠినంగా మీరు చూడకండి
బాణాలేసి ప్రాణలు తీయకండి
వన్యప్రాణులను బ్రతకనీయండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి