న్యాయాలు -934
ఫలముఖ గౌరవం న దోషావహమ్ న్యాయము
*****
ఫలముఖ అనగా ఫలితము ద్వారా, కష్టానికి తగిన ప్రతిఫలం. గౌరవం అనగా అభిమానము,ఆదరించు,పూజించు, మర్యాద,సత్కరించు,సన్మానించు. న అనగా కాదు, లేదు.దోష అనగా తప్పు,లోపం,దోషం.ఆవహం అనగా ఆహ్వానం,పిలుపు,తెచ్చేది,తీసుకు రావడం లాంటి ఎన్నో అర్థాలు ఉన్నాయి.
గౌరవము వల్ల కలిగే ఫలముల వల్ల దోషము లేదు.గౌరవము కలవాడు ప్రయత్నము చేయకపోయినా ఒకప్పుడు ఫలమును పొందుతాడు.అది తప్పు కాదు.అది ఆ వ్యక్తి యొక్క యోగ్యతను బట్టి కలుగుతుంది అని అర్థము.
ఎవరైనా సరే వ్యక్తిగా మంచివాడుగా,ఉన్నతుడుగా భావింపబడితే ఎప్పటికైనా సజ్జనుడుగా గుర్తింపబడతాడు.వివిధ రంగాలలో అయితే తగిన ఫలాన్ని కూడా పొందుతాడనే భావన, నమ్మకం ఆధారంగా ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
ఫలముఖ గౌరవం పొందడానికి ముందుగా గౌరవం అంటే ఏమిటో?ఎలాంటిదో ?అది ఎవరెవరి మధ్య ఉండాలో? ఎందుకు గౌరవించుకోవాలో కూడా తెలుసుకుందాం.
గౌరవం వివిధ అర్థాలతో కూడిన పదం. గౌరవం అనేది ఒక వ్యక్తి యొక్క స్వాభావిక విలువ. ఇది వ్యక్తి యొక్క పరిస్థితులకు అతీతంగా అందరికీ ఉంటుంది.అదెలా అంటే సమాజంలో జీవించే పౌరుడుగా లభించే గౌరవం.
గౌరవం అనేది వ్యక్తి యొక్క పాత్ర, అతని స్థాయి, అతని నైతిక ప్రవర్తన నైపుణ్యం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.వ్యక్తిగత లాభం కంటే సమాజానికి ఉపయోగపడేలా జీవించడం.మనస్సాక్షిగా విధి నిర్వహణలో నిజాయితీగా కృషి చేయడం లాంటివి వ్యక్తిని గౌరవించేలా చేస్తాయి.అనగా వ్యక్తిని విలువైన వాడిగా భావించి అతని పట్ల శ్రద్ధ, మర్యాద మన్నన కనబరచడం.గౌరవం నాలుగు రకాలుగా ఉంటుందని మన పెద్దవాళ్ళు తరచూ అంటుంటారు.
అవి ఒకటి యోగ్యత యొక్క గౌరవం.రెండు నైతికత లేదా అస్థిత్వ స్థాయి యొక్క గౌరవం.మూడు గుర్తింపు యొక్క గౌరవం.నాలుగు సార్వత్రిక మానవ గౌరవం.
మొదటిది యోగ్యత. దీనినే ఆత్మ గౌరవం అనవచ్చు. ఇది ప్రతి వ్యక్తి స్వంత విలువ.
రెండవది నైతికత లేదా అస్థిత్వ స్థాయి గౌరవం అంటే వ్యక్తి యొక్క ఔన్నత్యం మానవత్వంతో ముడిపడి ప్రత్యేక సామర్థ్యాన్ని సూచిస్తుంది.ఇది పవిత్రత, స్వయం ప్రతిపత్తి వ్యక్తిత్వం, అభివృద్ధి మరియు ఆత్మగౌరవ ఆలోచనలతో ముడిపడి ఉంటుంది.
మూడోది గుర్తింపు యొక్క స్థానము.ఇది తాను చేసే విధులు.అందులో చిత్తశుద్ధి.విధి నిర్వహణలో ఎలాంటి అపోహలు, అనుమానాలకు దారి తీయకుండా సమయ పాలన పాటిస్తూ పనిగంటలు దుర్వినియోగం చేయకుండా సామాజిక నిబంధనలకు లోబడి పని చేసే వ్యక్తికి శాఖా పరంగా మరియు సమాజంలో చక్కని గుర్తింపుతో కూడిన గౌరవం లభిస్తుంది.
ఇక చివరిది సార్వత్రిక గౌరవం. ఒకరినొకరు గౌరవించడం. తనకంటూ ఉన్న సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ వాటిని ఇతరులవి గౌరవిస్తూ, వాటికి భంగం కలగకుండా ఉండటం.జాతీయ చిహ్నాలు, చట్టాలను, ప్రకృతిని గౌరవించడం మొదలైనవి.
ఇలాంటి మానవీయ విలువలు కలిగిన వ్యక్తి ఏ ప్రయత్నమూ చేయకపోయినా గౌరవింపబడతాడు.అలాంటి ఫలముఖ గౌరవం పొందడానికి కారణం అతనిలోని నాలుగు రకాలైన కోణాలతో మిళితమైన గౌరవంగా చెప్పుకోవచ్చు.
మరి మనం అలాంటి గౌరవం పొందాలంటే ఫలాల కోసం ఆశపడకుండా మనదైన ఉన్నతమైన వ్యక్తిత్వంతో విధులు నిర్వర్తిస్తూ ఉండటమే. ఇదే ఈ "ఫలముఖ గౌరవం న దోషావహం న్యాయము"లో యిమిడి వున్న మూల సూత్రం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి