: 'విజ్ఞాన గని...!:- భారతి అప్పళాపురం.: నెల్లూరు
సాహితీకవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
===============
వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడైన 
 దైవ స్వరూపుడీ  వైశంపాయనుడు...
వేదాలను విభిజించి విజ్ఞానాన్ని విస్తరింపజేసిన 
 విజ్ఞాన గని ఈ  వేదవ్యాసుడు...

లోకం పోకడ నిక్షిప్తం చేసి 
 భారతాన్ని పంచము వేదముగా మలిచాడు...
భగవానుని సందేశాన్ని భగవద్గీతగా మలచి
మనిషి మనుగడకు దిశా నిర్దేశం చేశాడు...

అష్టాదశ పురాణములు అందించిన
 ఈ ఆది గురువు పూర్ణత్వానికి సారూప్యము...
అన్నీ తెలిసిన దేవతలైనా,
ఏమీ తెలియని రాక్షసులైనా,
గురువును ఆశ్రయించక తప్పదు...

 ఈ సత్యవతీ సుతుడు సంస్కార నీతులు బోధించే
 సాక్షాత్ పరబ్రహ్మ...
తల్లిదండ్రులకు సమానమైన వాడు ఈ తొలి గురువు... 
 ఈ పరాశర పుత్రుడు పౌర్ణమి రోజు పుట్టి 
 జగతికి  వెలుగులు పంచాడు...
గురువులకు మించిన ఈ గురువు పుట్టినరోజే గురు పౌర్ణమి...
 ఈ కృష్ణ ద్వైపాయునుడు చూపించే మార్గమే సన్మార్గం..



కామెంట్‌లు