జీవితం ఓ ప్రయాణం:- ఓగిరాల గాయత్రి
సాహితీ కవికళాపీఠం – 
సాహితీ కెరటాలు 
=================
మొన్న పొగబండి... అయ్యేనండీ విద్యుత్ బండి!
ఇంధనం మారినా, వేగం మాత్రం తారసపడదు!
వయ్యార భామ పొడవాటి జడలా కనిపిస్తుంది,
పాములా నేలపై పాకుతుంది నిదానంగా.

బాణంలా గమ్యాన్ని చేరుతుంది,
రణరంగ భేరిలా వినిపిస్తుంది.
దూరాలను దాటే ఉత్సాహమే లక్ష్యం,
సురక్షిత ప్రయాణానికి ఇది సంకేతం.

దూరపు కొండల మధ్య వేగంగా దూసుకుంటూ,
ఎర్రని సూర్యుడిని పొడిచేస్తుంది.
రైలు పరిగెడుతోంది,
పట్టాలు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది.

కింద భూమి వెనక్కి పరుగు తీస్తోంది,
కంకర రాళ్లు గాలిలో కలుస్తున్నట్టు.
ఆగిన రైలు కూడా కదులుతున్నట్టు బ్రహ్మం!
ఊయల ఊగే ముద్దైన భావన!

గుండె భారం తీరిన ఆహ్లాదం,
ప్రపంచం మరిచి ప్రయాణంలో లీనమయ్యే మనసు.
వినీలాకాశంలో పక్షినై ఎగురుతున్నట్టు,
ఈ రైలు ప్రయాణం – ఓ అద్భుత అనుభూతి!


కామెంట్‌లు