కోరని వరమేదో కొంగు నింపి
మారని రాతలు మార్చేసి
కోయలేని తారలను కోసే
మాయను ముంగిట నిలిపే....
నిచ్చెన లేకనే నింగికి నేనెగిసానా?
నేలకు చుక్కలు దిగి వచ్చాయా?
నీరు నిండిన కనులకు మసకగా
నిజం నేనేనంటూ కనిపించేనా?
నడిచే బాటలో పూ పొదలే
దాపుకు రమ్మని పిలుపులే
విరిసే పూవుల గుత్తులే
విరజిల్లే కమ్మని పరిమళాలే!
వెలుగుల తీరం చేరమని
వెలుతురు తోడుగా సాగమని
వెతలన్నీ ఇక కతలేనని
వెరువక ముందుకు నడవమని...
నమ్మిన సత్యం విడవకనే
దమ్ముగ నిత్యం ఉండమని
రమ్మని చెంతకు చేరదీసి
కమ్మని జీవనమిచ్చే కరుణకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి