చందమామ ఓ చందమామ
నీలాల నింగిలో తేలియాడేవు
మబ్బుల్ల మాటున మణిగావు
తళుకు చుక్కల తోడ తరలి వచ్చావు
చందమామ ఓ చందమామ ॥
కలువల్లు నీ రాకతో చిరునవ్వు విసిరే
కవులంతా నిన్ను గాంచి కవితల్లు అల్లే
భాగవతులెల్ల భవునిపై భావగీతం పాడే
చందమామ ఓ చందమామ ॥
తల్లులు నిను గని మురిపాలు జూపంగ
పాపలు నిను చూచి కేరింతలుప్పొంగ
నీ హొయలు,సొగసుల్లో మిణుకు తారలు రావంగ
చందమామ ఓ చందమామ ॥
సరససల్లాపాలాడు బావమరదల్లు
హిమమై,సుమమై నీ కంటి చూపుల్లో
పదియారు కళలతో ఫరవడిల్లారు
చందమామ ఓ చందమామ ॥
శివుని శిరమ్మున చంద్రరేఖవై
పుడమి తల్లికి మోహనరాగమై
గగన తలంబున మౌన రాగమై
జగంబు హృదయాన ప్రేమాను రాగమై
చందమామ ఓ చందమామ ॥
నీలాల నింగిలో తేలియాడేవు
మబ్బుల్ల మాటున మణిగావు
తళుకు చుక్కల తోడ తరలి వచ్చావు
చందమామ ఓ చందమామ ॥
కలువల్లు నీ రాకతో చిరునవ్వు విసిరే
కవులంతా నిన్ను గాంచి కవితల్లు అల్లే
భాగవతులెల్ల భవునిపై భావగీతం పాడే
చందమామ ఓ చందమామ ॥
తల్లులు నిను గని మురిపాలు జూపంగ
పాపలు నిను చూచి కేరింతలుప్పొంగ
నీ హొయలు,సొగసుల్లో మిణుకు తారలు రావంగ
చందమామ ఓ చందమామ ॥
సరససల్లాపాలాడు బావమరదల్లు
హిమమై,సుమమై నీ కంటి చూపుల్లో
పదియారు కళలతో ఫరవడిల్లారు
చందమామ ఓ చందమామ ॥
శివుని శిరమ్మున చంద్రరేఖవై
పుడమి తల్లికి మోహనరాగమై
గగన తలంబున మౌన రాగమై
జగంబు హృదయాన ప్రేమాను రాగమై
చందమామ ఓ చందమామ ॥

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి