ది డయోన్ క్వింటుప్లెట్స్ :- - యామిజాల జగదీశ్
అది 1934 మే 28. కెనడాలోని ఒంటారియోలోని ఒక చిన్న పట్టణంలో, విద్యుత్ లేని ఓ ఇంట్లో  ఐదుగురు ఒకేలాంటి సోదరీమణులు జన్మించారు. ఇది వైద్య చరిత్రలో ఒక అసాధారణ సంఘటన. బాల్యంలోనే జీవించిన ఏకైక ఒకేలాంటి ఐదుగురు పిల్లలు.
వారి తల్లి ఎల్ జైర్ డియోన్ Elzire Dionne. ఆమెకు అప్పుడే అయిదుగురు పిల్లలున్నారు. ఇక నాటి తాజా కాన్పులో ఒకేసారి మరో అయిదుగురు పిల్లలు జన్మించారు.
వారి పేర్లు, అన్నెట్, ఎమిలీ, వైవోన్, సెసిల్, మేరీ. ఆమె స్పృహలోకి రావడంతోనే మీకు అయిదుగురు పుట్టారని వైద్యులు చెప్పినప్పుడు "ఔనా" అంటూ ఆశ్చర్యపోయింది తల్లి ఎల్ జైర్. పెద్దగా అరిచింది. 
"ఈ పిల్లలందరినీ నేను ఏమి చేయబోతున్నానో?" అని చెప్పింది.
ఇది ఊహాతీతంగా ఒక అద్భుతమైన ఘటన.
అయిదుగురు పిల్లలందరి పరువూ కలిపితే మొత్తం 6 కిలోలే. వారిలో అతి చిన్న శిశువు బరువు కేవలం 450 గ్రాములు. తక్కువ బరువుతో పుట్టిన వారిని కాపాడటం ఓ సవాలుగా మారింది. ఇంక్యుబేటర్లు లేదా ఆధునిక వైద్య సాంకేతికత లేకుండా, అవి మనుగడ సాగించడం అసంభవం అనిపించింది.
ఐతే గ్రామీణ వైద్యుడు డాక్టర్ అల్లన్ రాయ్ డఫో ఈ పసికందులను అంకితభావంతో చూసుకున్నారు. వినూత్న పద్ధతులను ఉపయోగించి వేడి నీటి సీసాలు, కట్టెల పొయ్యి తో వేడి చేయడం, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం, వారి వ్యవస్థలను ఉత్తేజపరిచేందుకు ఆవు పాలు, స్టెరిలైజ్డ్ నీరు, కార్న్ సిరప్, కొన్ని చుక్కల రమ్ కలిపి ప్రత్యేక మిశ్రమాన్ని వారికి అందించడం ద్వారా కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ శిశువులు అన్ని అసమానతలను ఎదుర్కొని, ఐదుగురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. పుంజుకున్నారు.
ఐదుగురు పిల్లలు ప్రపంచ సంచలనంగా మారారు. అయితే, వారి కీర్తి సవాళ్లతో కూడినది. ప్రభుత్వం బాలికల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 
వారు "క్వింట్‌ల్యాండ్" అనే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివసించారు. ఇది పర్యాటక ఆకర్షణగా మారింది. వేలాది మంది ఈ బాలికలను చూడటానికి వచ్చారు. వారి బాల్యాన్ని ప్రజా దృశ్యంగా మార్చారు.
కష్టాలు ఉన్నప్పటికీ, డియోన్ సోదరీమణులు ఎంతో జాగ్రత్త వహించారు. 
వారి కథ మానవ బలం, వైద్య పురోగతి, దుర్బల పిల్లలను రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూనే వచ్చింది.
వారి జీవితాలు ఓ గొప్ప పుస్తకం. డాక్యుమెంటరీలు తీశారు. పిల్లల సంక్షేమంలో తీసుకోవలసిన చర్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.
చూడటానికి అచ్చంగా ఒకేలా పుట్టిన ఈ ఐదుగురు పిల్లలలో కాలక్రమంలో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారు.
మరణించిన ముగ్గురు...వైవోన్ ఎడౌల్డా మేరీ డియోన్నే (2001). ఎమిలీ మేరీ జీన్నే డియోన్నే (1954), మేరీ రీన్ ఆల్మా హౌల్ (1970).
బతికున్న ఇద్దరు... అన్నెట్ లిలియన్నే మేరీ అల్లార్డ్, సెసిల్ మేరీ ఎమిల్డా లాంగ్లోయిస్.
 


కామెంట్‌లు