వైశ్యుల చరిత్ర:- గుర్రాల లక్ష్మారెడ్డి, -కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా
 శ్లో//విశత్యాయ పశుభ్యశ్చ కృష్యాదానరుచుశ్శుచి
వేదాధ్యయనసంపన్నస్స వైశ్య ఇతి సంజ్ఇకః.
పై శ్లోకము వలన వై శ్యులు వేద అధ్యయన సంపన్నులు అని తెలుయు చున్నవి. శ్రీహర్షుడు రచించిన గ్రంథము నైషధము వలన శ్రీ హర్షుడు వైశ్యుడుఅని తెలిసినది. మాతృగుప్తుడు కూడా వైశ్యుడే. పంచ సిద్ధాంతమును రచించిన బ్రహ్మగుప్తుడు కూడా వైశ్యుడే. క్రీస్తుకు పూర్వం 320 ప్రాంతంలో ఉజ్జయిని రాజ్యమును వేలిన పుష్యగుప్తుడు వైషుడే.
చంద్రగుప్తుడు, సముద్ర పుత్రుడు.
కుమారగుప్తు డు వైశ్య వంశమునకు చెందినవారే.
కుసుమ శ్రేష్ఠి వైశ్యుల మూలపురుషుడు. కుసుమాంబికను వివాహమాడి కన్యకాంబిక అను పుత్రికను కనెను. కుసుమ శెట్టి కుబేరుని పుత్రుడు. కావున తన వంశం వాళ్ళందరూ కుబేరులవుతారని విషద పరిగెను.
వైశ్యులలో 714 గోత్రములు కలవు. కానీ ప్రస్తుతం 103 గోత్రములవారే ప్రసిద్ధులు అవుతారని తెలిపారు.
గోమట మందు నివసించుటవలన గోమతి అని వీరికి పేరు వచ్చింది.
గోమతియే కోమతి యై కోమటిగా వ్యవహారం
క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో హర్షవర్ధన్ ని దండయాత్ర భయం చే తమ మగధ దేశమును వీడి మన ఆంధ్రదేశమునకు వలస వచ్చిరి. గో సమూహములను వెంబడి తీసుకొని నా నా ప్రాంతంలో తిరిగి చివరకు క్రీస్తు శకం 1098 వ సంవత్సరము లో పశ్చిమ దేశంలోని బెల్గాం అందరి
దొడ్డబెట్ట పైన గోమటేశ్వరుని విగ్రహమును ప్రతిష్టించి అక్కడనే నివాస నుండి ఆంధ్ర దేశానికి వచ్చారని ప్రతిదీ.

కామెంట్‌లు