వింత కాకి :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కొడవలి లాంటి ముక్కుతో 
కొత్త కాకి వచ్చింది 
కొమ్మ మీద వాలింది 
కొంటె చూపు చూస్తుంది

ఒంటరిగా అది నిలిచింది 
తుంటరి పిల్లలు రారండి 
అమ్మా నాన్నను పిలవండి 
అవ్వ తాతకు చెప్పండి 

ఇలాంటి కాకిని చూశారా 
వారిని మీరు అడగండి 
కొత్తగా వచ్చిన ఆ కాకి 
దాని ముక్కు గమ్మత్తుగుంది

ఎంత గట్టి బొక్కనైన పట్టి
ఆ ముక్కుతో పొడుస్తే
రంపంలా కట్టవుతుందట 
యింపుగా మీరు చూడండి 


కామెంట్‌లు