కుక్క నిరీక్షణ:- - యామిజాల జగదీశ్
 అది 1974వ సంవత్సరం. వ్నుకోవోలోని మాస్కో విమానాశ్రయంలో, ప్రయాణీకులు నోరిల్స్క్ నగరానికి (దేశం యొక్క ఉత్తర చివరన) వెళ్లే Il-18 విమానం ఎక్కారు.
ప్రయాణీకులలో ఒకరు రన్‌వేపై ఉన్న విమాన సహాయకుడితో సుదీర్ఘమైన, తీవ్ర స్థాయిలో వాదనకు దిగారు. అతని జర్మన్ షెపర్డ్ (శునకం)
ఆందోళనతో అతని చుట్టూ తిరుగుతోంది.
అయితే వాదన ప్రయాణీకుడు ఊహించిన విధంగా జరగడం లేదు. దాంతో కలత చెందిన ఆ ప్రయాణికుడు,  విమాన సహాయకుడి నుండి దూరంగా వెళ్లి, తన కుక్క వంక చూసాడు. అయితే కుక్క, వాకింగ్ వెళ్ళడానికి అవకాశం ఉందనుకుని, ట్రాక్‌పై సంతోషంతో పరిగెత్తడం ప్రారంభించింది.
తీరా యజమాని విమానం ఎక్కాడని, ఎక్కడానికి ఉంచిన మెట్లు తీసేసారని, తలుపు మూసివేస్తారని, విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోందని ఆ కుక్కకు తెలియలేదు. చివరికెలాగో అక్కడ ఏం జరిగిందో గ్రహించిన కుక్క IL-18 వెనుక పరుగెత్తింది. అది తన పరుగుని వేగవంతం చేసింది. చాలా సేపు దాని చూపు ఆ విమానంపైనే ఉంది.  చివరికి విమానం కనిపించకుండా ఎగిరి పోయింది. ఈ సంఘటన లక్షలాది మంది సోవియట్ల హృదయాలను చలింప చేసింది. ఆ కుక్క పైలట్లు, విమానాశ్రయ సిబ్బంది దృష్టిని ఆకర్షించింది.  మొదట, వారు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. ఎంతో అప్రమత్తంగా ఉన్నాం ఆ జర్మన్ షెపర్డ్ కుక్క ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించ లేదు. అన్ని నియమాలను ఉల్లంఘించి, వ్నుకోవో సిబ్బంది దానిని బాధ్యతగా తీసుకున్నారు.
వారు కుక్కకు ఆహారం పెట్టటానికి ప్రయత్నించారు. కానీ అది ఎవరి దగ్గరికి రావడానికి నిరాకరించింది. కుక్క పేరును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, వారు వేర్వేరుగా ప్రయత్నిం చారు. ఎట్టకేలకు కుక్క అల్మా అనే పిలుపునకు ప్రతిస్పందించింది.  చివరికి వారు దానిని పాల్మా అని పిలిచి మచ్చిక చేసుకున్నారు.‌ అది దాదాపు రెండేళ్ళ పాటు తన యజమాని కోసం అక్కడి విమానాశ్రయంలో నిరీక్షించినప్పుడు తీసిన ఫోటోనే ఇక్కడిది.

కామెంట్‌లు