ఓ మనసా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
జాబిలివి నువ్వే
వెన్నెలని చల్లే
పొంకమూ నువ్వే
ప్రమదమూ ఇవ్వే     ||జాబిలి||

సుమానివి నువ్వే
సౌరభము చిమ్మే
దీపమువు నువ్వే
కాంతుల్ని చిందే

నవ్వువూ నువ్వే
మోమునా వెలుగే 
సిగ్గువూ నువ్వే
బుగ్గలో చూపే       ||జాబిలి||

తేనెవూ నువ్వే
తీపినీ ఇవ్వే
మాటవీ నువ్వే
తేటగా పలుకే

ప్రేమవూ నువ్వే
మమతనూ చాటే
రాగమూ నువ్వే
రమ్యతా పంచే      ||జాబిలి||

కలలోకి రావే
కవ్వించి పోవే 
కలమువూ నువ్వే
కవితనూ రాయే

ఊహవూ నువ్వే
భావమూ ఇవ్వే
ఊయలా నువ్వే
నిద్దురా పుచ్చే       ||జాబిలి|| 

స్వర్గమూ నువ్వే
సుఖములూ ఇవ్వే
గమ్యమూ నువ్వే
బాటనూ చూపే

లక్ష్మివీ నువ్వే
భాగ్యము నింపే
వాణివీ నువ్వే
వివేకము పెంచే      ||జాబిలి||  


కామెంట్‌లు