అరుణోదయంసాహితివేదిక ఆధ్వర్యంలో,అరుణాక్షర కవితాతోరణాలకవిసమ్మేళనం

]అరుణోదయసాహితీ వేదిక, అనుబంధ సంస్థల అరుణాక్షర కవితాతోరణాలు కవితలు, అరుణరాగాలు పాటల కార్యక్రమం 
మంగళవారం అంతర్జాల వేదిక ఆధారంగాఘనంగా జరిగింది.
అవసరాల రమణి గారి ప్రార్థనా గీతంతో మొదలైనసభఏ ఆటంకం  లేకుండా కవితలతో, పాటలతో ఆనందంగా,ఉత్సాహభరితంగా సాగింది.
డా. రామకృష్ణచంద్రమౌళి గారి స భాద్యక్ష్యతన జరిగినఈసభకు ముఖ్యఅతిథిగా డా.ఆచార్య ఫణీంద్ర శర్మ గారు,ఆత్మీయ అతిథులుగా కృష్ణారెడ్డిగారు, ఘంటామనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
డా. V. D. రాజగోపాల్ గారు రాలేకపోయినా శుభాకాంక్షలు తెలియచేసారు.
ముందుగా ఆచార్య ఫణీంద్ర గారు  కవుల కవితలు సమాజపరంగాపరిస్థితులను గమనిస్తూ,సులభభాషలో, అందరికీ అర్ధం అయ్యేరేతిగా కవితలు,ఉండాలని తెలియచేస్తూ,దాశరథి, వట్టికోట ఆల్వార్ గారి రచనలను వివరించారు,ఎన్నోసాహిత్య విషయాలనుకవులకు తెలియచేసారు.కృష్ణారెడ్డి గారుపౌరాణిక పద్యాలను వివరిస్తూ ధుర్యోధన,కౌరవ, కృష్ణ ఇలా అనేక పద్యాలతో సభను రoజింప చేసారు.
సభాఅధ్యక్షులు డా. రామకృష్ణచంద్ర మౌళిగారు అరుణోదయ సాహితీ సంస్థలు చేస్తున్న సాహిత్య సేవలు కొనియాడారు.
దాదాపు మూడు గంటలపాటు జరిగిన కార్యక్రమానికి 
డా. నాయకంటి నర్సింహశర్మ నిర్వహించిన కవిసమ్మేళనం లో దాదాపు 40 మంది కవులు, గాయనీ గాయకులు పాల్గొన్నారు.
గుర్రామల్లేశం, v. మంజుల, v. సత్యబాల, శోభాదేశ్ పాండే, అనంతాత్ముల శ్రీనివాస్, అంబా భవాని,అయ్యలసోమయాజుల ప్రసాద్, తాతపూడి సోమశేఖర శర్మ,, సుజాతతిమ్మన, లలితా కుమారి, మాణిక్యలక్ష్మి, రఘు రామిరెడ్డి, అ. రమణి, v. మంజుభార్గవి,v. శారద,G. K సుభ్రహ్మణ్యo. p. ధనమ్మ ఇంకా తదితరులు  పాల్గొని చక్కని కవితలు,పాటలు వినిపించి ముడుగంటల పాటు ఆనందంగా, స్నేహపూరిత 
వాతావరణంలో గడిపారు.
అందరికీ పేరుపేరునా సంస్థ వ్యవస్థాపకురాలు డా. అరుణ కోదాటి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలతెలిపింది.
 
కామెంట్‌లు