ఒక యువకుడు అడవిలో నడుస్తున్నాడు. అతనికి ఆకలి వేసింది. చెట్టు పైన పండిన పండ్లు కనిపించాయి.
అతను చెట్టు పైకి ఎక్కి వాటిలో కొన్నింటిని కోసి తిన్నాడు.
బాగా పండిన సువాసనగల పండ్లు కొమ్మల కొనల వద్ద ఉన్నాయి. వాటిని కోయడానికి అతను ప్రయత్నించాడు. అయితే అతని బరువు కారణంగా ఒక కొమ్మ విరిగిపోయింది.
అకస్మాత్తుగా, అతను కింద ఉన్న మరొక కొమ్మను పట్టుకుని వేలాడాడు. అతను కిందకి చూసేసరికి, నేల చాలా కింద ఉందని గ్రహించాడు.
అప్పటికే భయపడిన అతను కళ్ళు మూసుకుని, "ఎవరైనాసరే, నన్ను రక్షించండి" అని అరవడం ప్రారంభించాడు. అతని అరచేతులు చెమటలు పట్టడంతో జారడం ప్రారంభించాయి.
అనుకోకుండా, ఒక వృద్ధుడు ఆ వైపు వచ్చాడు. చెట్టు నుండి వేలాడుతున్న ఇతనిని చూశాడు. అతనిపై ఒక చిన్న రాయి విసిరాడు.
ఆ రాయి అతనిని తాకిన వెంటనే, ఆ వ్యక్తి నొప్పితో క్రిందికి కోపంగా చూశాడు.
"ఓ పెద్దాయనా, సహాయం అడిగితే, నువ్వు రాయితో కొడతావా?" అని కోపంగా అడిగాడు.
ఆ పెద్దాయన సమాధానం చెప్పకుండా, మరో చిన్న రాయిని అతనిపై విసిరాడు.
కోపంగా ఉన్న యువకుడు ఎంతగానో ప్రయత్నించి, మరొక కొమ్మను పట్టుకుని, "నేను కిందకు వస్తే, నిన్నేం చేస్తానో చూడు" అని హెచ్చరించాడు.
పెద్దాయన అతనిపై మరొక రాయి విసిరాడు. ఆ యువకుడు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసి ఇంకొక కొమ్మపైకి ఎక్కాడు.
చివరకు ఎలాగోలా ఆ యువకుడు కిందకు వచ్చి నేరుగా పెద్దాయన దగ్గరకు వచ్చాడు. అతన్ని తిట్టాడు.
"నువ్వు అలా ఎందుకు రాళ్ళు విసిరావు...? నేను నిన్ను సాయం చేయమని అడిగితే రాళ్ళు విసురుతావా?" అని అన్నాడు.
పెద్దాయన చిన్న నవ్వు నవ్వి, "సోదరా.. నేను నీకు సహాయమే చేసాను" అని అన్నాడు.
యువకుడికి ఏమీ అర్థం కాలేదు.
పెద్దాయన వివరించాడు. "నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు, నువ్వు భయంతో స్తంభించిపోయావు. నీ మెదడు పనిచేయడం లేదు.
నేను ఆ రాయి విసిరినప్పుడు, భయం మాయమవడం మొదలైంది. నన్ను ఎలా పట్టుకోవాలో ఆలోచించడం మొదలుపెట్టావు.
నువ్వు ఆలోచించడం మొదలుపెట్టగానే నిన్ను నువ్వు కాపాడుకుని కిందకి దిగావు. మొదట్లో, నిన్ను నువ్వు కాపాడుకోగలనని అనుకోలేదు. అది భయం వల్ల. నీ భయం నీ కళ్ళను దాచి పెట్టింది. నిన్ను ఆలోచించనివ్వలేదు.
నేను నిన్ను ఆ భయం నుండి మళ్లించాను" అని చెప్పి తన దారిలో వెళ్ళిపోయాడు.
భయం ఒక వ్యక్తిని మూర్ఖుణ్ణి చేస్తుంది. ఆలోచించనివ్వదు. ఆందోళనపడతాడు! కనుక భయం పోతే మామూలు స్థితికొస్తాం. ఆలోచించి ఓ నిర్ణయానికొస్తాం. సమస్యకు పరిష్కారమూ తెలుస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి