రాష్ట్రస్థాయి కవితాపోటీలో కవి,రచయిత 'అయ్యలసోమయాజుల ' ద్వితీయ విజేత.

 భాగ్యనగరం లోని సాహిత్యం, సమాజహితం,నిరంతర ప్రవాహం ధ్యేయంగా సాహితీ కృషి చేస్తున్న ప్రముఖ సాహితీ సంస్థ విమలసాహితీ  ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో  'కార్గిల్ విజయ దివస్"  సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ కవితను స్వీకరించి ద్వితీయవిజేతగా  వ్యవస్థాపకులు కవి డాక్టర్ జెల్ది విద్యాధర్ ఐ.ఆర్.ఎస్.కార్యదర్శి నిర్వాహకులు తురుమెళ్ళ కళ్యాణి అభినందనలు తెలియచేస్తు ప్రశంసా పత్రాన్ని వర్చువల్ విధానంలో అందచేసారు.
ప్రసాద్ మాస్టారుకి ఈ సందర్భంగా సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేసారు....!!
..............................
కామెంట్‌లు