ఒక అవసరం...
నీ పీక పిసికే వేళ…
నోరు తెరిచి అడుగు...
చేయిచాపి...పుచ్చుకో…!
ఎవరైనా ఆపదలో ఉంటే
తడబడక తక్షణమే ఆదుకో
ఆనందంగా...సంతోషంగా...
మదన పడక...మనస్ఫూర్తిగా...
ఇవ్వగలిగినంత...ఇచ్చుకో..!
కానీ...
ఇరుగు పొరుగువారు
ఇబ్బందుల్లో ఉండగా
కళ్ళారా చూసినా...
చెవులారా విన్నా...
నీ ముఖం చాటేయకు...
నీ చేతులు ముడుచుకోకు..!
ఆలస్యం చేయకు...
ఆలస్యం...చేయకు...
అతిగా...ఆలోచించకు...
సకాలంలో...స్పందించు...
సహాయం...అందించు...!
అది కదా దాతృత్వమంటే...?
అది కదా మంచితనమంటే...?
అది కదా మానవత్వమంటే...?
అది కదా మచ్చలేని వ్యక్తిత్వమంటే...?
అది కదా దైవత్వమంటే..?అప్పుడు కదా
ఈ మానవజన్మకు ఒక అర్థం పరమార్థం..?
నిజానికి నీవు నిస్వార్థంగా
చిత్తశుద్ధితో చేసే ఆ పనిని
పరమాత్మ మెచ్చుకుంటే..?
నీవు కోరినా కోరకున్నా....
అడిగినా అడగకున్నా...
ఏదో ఒక రోజు...నీవు
కలలో సైతం ఊహించని రీతిగా
నీపై...నీ కుటుంబంపై "వరాల వర్షం"
కురిపిస్తాడు ఆ దైవం...కుండపోతగా...
ఇది సత్యం…ఇది సత్యం…
ఇది ఎవరూ కాదనలేని నగ్నసత్యం..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి