పవన్ ఫ్యాన్స్ జేజేలు…సగటు ప్రేక్షకుడి నిరాశ:- -ఎస్.వి.రమణా చార్య,సీనియర్ జర్నలిస్ట్

 (హరిహర వీరమల్లు  సినిమా రివ్యూ)
నటుడు: పవన్ కళ్యాణ్
దర్శకత్వం: క్రిష్ (ప్రధానంగా), తర్వాత జ్యోతి కృష్ణ
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ప్రకటన కాలం: దాదాపు 4 సంవత్సరాలు
రిలీజ్: 2025 జూలై ఆసక్తికరంగా మొదలై... మధ్యలో తడబడిన కథ ఒక చారిత్రాత్మక నేపథ్యం, దొంగతనపు కథా అంశం, మహారాజుల రాజకీయం ఇవన్నీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ….కథలో పాయింట్ ఉందనిపించినా, ప్రత్యేకమైన కన్‌ఫ్లిక్ట్ లేదు.ఔరంగజేబ్, కోహినూర్ వజ్రం, వీరమల్లు ప్రయాణం అన్నీ శబ్దాల్లా వినిపించినా, ఎమోషన్ తగ్గిపోయింది..డైలాగులు నాటకీయంగా వదలబడ్డా, నేటి సగటు ప్రేక్షకుడికి గుండెను తాకలేక పోయాయి.
పవన్ నటన భేష్..
పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ పర్ఫార్మెన్స్ – ఫ్యాన్స్ కి ఫీస్ట్.. కానీ ఇతర పాత్రలు తేలిపోయాయి, స్పష్టమైన విలన్ లేకపోవడం ఓ  పెద్దలోపం హీరోయిన్ పాత్ర ఫీల్ నిచ్చే దిశగా కాకుండా – ఏదో ఉన్నట్టుండి పోయింది.
VFX, గ్రాఫిక్స్ కొన్ని చోట్ల ఆకట్టుకున్నా... చాలా చోట్ల అల్పంగా అనిపించింది. కెమేరావర్క్ & సెట్స్ భిన్నంగా అనిపించినా నిజమైన చారిత్రిక అనుభూతి ఇవ్వలేకపోయాయి.  ఫైట్ సీన్స్ స్టైలిష్‌గా ఉన్నా, నాటకీయంగా కొనసాగాయి.
సంగీతం వినసొంపే కానీ.. పాటలు గుండెను తాకలేదు.కీరవాణి నేపథ్య సంగీతం బాగుంది.కానీ పాటలు ఎమోషన్ పుట్టించలేదు.. సీన్-పాట అనుసంధానం సాధారణ స్థాయిలో ఉంది
ఫస్ట్ హాఫ్: పరిచయం లేటుగా మొదలై, కథ ప్రారంభం ఆలస్యమైంది
సెకండ్ హాఫ్: కొంత ఉత్తేజంగా సాగినా, క్లైమాక్స్ ఎఫెక్ట్ తగ్గిపోయింది
నిరంతర యాక్షన్ లేకుండా కథలో గంభీరత లోపించటం తో సగటు ప్రేక్షకుడిని బోర్ కొట్టించేలా చేసింది
 ప్లస్ పాయింట్లు..
పవన్ నటన & యాక్షన్ సీన్స్ కొన్ని గ్రాండ్ విజువల్స్ చారిత్రాత్మక సినిమాలపై ఆసక్తి ఉన్నవారికి చూసేలా…
మైనస్ పాయింట్లు
కథా వేగం మందగించడం. సహాయ పాత్రలు బలహీనంగా ఉండడం.VFX లో అసంతృప్తి. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
సగటు ప్రేక్షకుడికి నిరుత్సాహం
“పవన్ కళ్యాణ్‌ను ఓన్ చేయలేని సినిమా!”ఫ్యాన్స్ కి పండగ, కానీ నాన్-ఫ్యాన్స్ కి ఒక తటస్థమైన అనుభవం. గంభీరంగా సాగే ప్రయత్నంలో కథను తేలికగా తీసినట్టు అనిపించింది.
చివరి మాట..
 చారిత్రిక కథతో కమర్షియల్ హంగులు వేయాలంటే, ప్రేక్షకుడి మనసు గెలవాలి – కేవలం పవన్ మాస్ ఫైట్‌లు, డైలాగులు దానికి చాలవు.ఈ సినిమా "ఒక ఫ్యాన్ సెలబ్రేషన్", కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కాదని" భావించవచ్చు.

కామెంట్‌లు