దివ్యజ్ఞాన సంపన్నుడు:- పార్లపల్లె నాగేశ్వరమ్మ -నెల్లూరు
సాహితీ కవి కెరటాలు 
==================
సనాతన ధర్మం మన భారతదేశానికివరం.
జ్ఞానం ,సాహిత్యం అందులో సమ్మిళితం. 
కృష్ణ ద్వైపాయనుడు అను నామదేయుడు .
పరాశర మహర్షికి ప్రియ పుత్రుడు, 
మానవాళికి దార్శనికుడు, 
మహోన్నతమైన మార్గదర్శకుడు ,
అతడే...వ్యాసభగవానుడు దివ్యజ్ఞాన సంపన్నుడు.

వేదాల అధ్యయనంలో అసమాన్యుడు .
అర్థ సౌలభ్యత కోసం వేదాలను విభజించిన ఘనుడు .
మహాభారతాన్ని సృజించిన లబ్ద ప్రతిష్టుడు.
భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. 
మహాభారతం కాదు కేవలం ఒక ఇతిహాసం
ధర్మార్థ, కామ, మోక్షములను విశ్లేషించిన జీవన గ్రంథం.
ఇచ్చెను మానవాళికి ఒక దివ్య సందేశం ఇదే ఇదే పంచమ వేదం. 
అష్టాదశ పురాణాలు తెలిపెను మనిషికి ధార్మిక విలువలు.
వ్యాస మహర్షి రచనలు.. సంస్కృతి ,నాగరికతలపై వేసెను చెరగని ముద్రలు.



కామెంట్‌లు