విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి పత్రికలు దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేర్యాల ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల రచనలతో కూడిన మాసపత్రిక ' పాఠశాల పరిమళాలు' ను ఆయన ఆవిష్కరించారు. చేర్యాల ప్రాంతం నుండి పిల్లల పత్రిక రావడం అభినందనీయమని, కృషిచేసిన మండల విద్యాధికారి రచ్చ కిష్టయ్యను,ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
ఈ పత్రికలో పిల్లలకు ఉపయుక్తమైన విషయాలున్నాయని జిల్లా అకడమిక్ మానీటరింగ్ అధికారి భేతి భాస్కర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, నరిగె బాలభాస్కర్, రాకేశ్ రెడ్డి,ఆకుల వేణు
తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి