లోకస్ట్ విశేషాలు!:- అచ్యుతుని రాజ్యశ్రీ
 ఇవి మిడత జాతికి చెందింది. ఇవి సాధారణంగా ఒంటరిగానే జీవించి ఎక్కడైతే ఆహారం బాగా దొరుకుతుందో అక్కడికి వెళ్లి పంటలని నాశనం చేస్తాయి మై గ్రేటరీ లోకస్ట్,డిజర్ట్ లోకస్ట్ ఆఫ్రికా,మిడిల్ ఈస్ట్ లో ఉంటాయి.కేవలం కొన్ని నిమిషాల్లోనే  పైరుని సర్వనాశనం చేస్తాయి.50వేల మిలియన్ల ఈప్రాణులు250 చ.కి.మీ.హాంఫట్ చేస్తాయి.వర్షాకాలంలో ఆడవివందల వేల గుడ్లు పెడ్తాయి.బుల్లివి అందులోంచి బైటికొచ్చి హాయిగా పొట్ట నిండా మెక్కుతూ ఆహారంకోసం అలా సాగిస్తాయి తమ యాత్రను.తమ శరీరం బరువంత తిండితో దిట్టంగా తయారై రెక్కలు రాగానే పంటలను మింగేస్తాయి.విషాన్ని చల్లినా ఆకీటకాలు చావవు. గుడ్లనే నాశనం చేయాలి.
మోల్ క్రికెట్స్ అనే కీటకాలు భూమిలోపల బొరియల్లో కూచునిహాయిగా కూనిరాగాలు తీస్తాయి.వాటి కలుగు v ఆకారంలో ఉంటుంది.ఎడం ముందున్న రెక్కని కుడిరెక్కకేసి రుద్దుతూ శబ్దంచేస్తాయి. దువ్వెనతో వేలి గోరుని మీటితే చేస్తే వచ్చే శబ్దం లా వాటి గోల ఉంటుంది🌹

కామెంట్‌లు