ఆకాశం మీద ఒక కన్ను
చూపు కోల్పోయి
చీకటిని మాత్రమే మిగిల్చింది.
వెలుగునిచ్చే నక్షత్రాలన్నీ
చీకట్లోనే చిక్కుకున్నాయి.
మరో ఆకాశాన్ని సృష్టించేవరకు
దృష్టి జ్ఞానాన్ని
వెదుకోవాల్సిందే.!!
మన దగ్గర ఏమీ లేకున్నా
ఒక మాట మిగిలి ఉంటుంది
ఒక అక్షరం మిగిలి ఉంటుంది
అది దానం చేద్దాం!!
మన దగ్గర ఏమి మిగిలి లేకున్నా
ఏదైనా ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
మంచినే ఎన్నుకుందాం !!
మంచి మాటనే మాట్లాడుదాం !!
మనం
బ్రతకాలనే కోరుకుందాం.!!!
పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉద్యోగి మిత్రుడు బాలరాజుకు నివాళి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి