ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఒక పోర్టరు చివరి రైలు వెళ్లిన తర్వాత అటూ ఇటూ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఇంటికి బయలుదేరాడు.
ఇంతలో ప్లాట్‌ఫారమ్ బెంచ్ మీద కూర్చున్న ఒక వృద్ధ మహిళను అతను చూశాడు.
అతను ఆవిడ వద్దకు వెళ్లి అడిగాడు : "మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?" అని.
"నా కొడుకును చూడటానికి నేను ఢిల్లీకి బయలుదేరాను" అని ఆ పెద్దావిడ జవాబిచ్చారు.
"అమ్మా! అప్పుడిక రైళ్లు లేవు. చివరి రైలు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్ళిపోయింది..." అన్నాడు పోర్టర్.
ఆ మాటతో ఆవిడకు ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఒకింత ఆందోళన చెందారు...ఇక రైలు లేదా...ఈ రాత్రికి ఇక్కడేం చేయాలి దేవుడా అని అనుకున్నారు.
అయితే పోర్టరు, కరుణతో, ఆవిడను ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే హాల్ లోకి తీసుకెళ్లాడు.
"మీరిక్కడ ఈ రాత్రికి ఉండి ఉదయం వచ్చే రైల్లో డిల్లీకి వెళ్ళొచ్చు" అని చెప్పాడు. అక్కడితో ఆగక "మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు... అతను ఏమి చేస్తున్నాడు" అని ప్రశ్నించాడు.
"నా కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడు" అని ఆవిడ చెప్పారు.
"ఏంటీ రైల్వేలోనా... అతని పేరేంటీ? నేను మీ కొడుకుని సంప్రతించగలనేమో చూస్తాను..." అన్నాడు పోర్టరు.
"అతన్ని నేను లాల్ అని పిలుస్తాను. వాడ్ని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి (అప్పట్లో ఆయన రైల్వే శాఖ మంత్రి) అని పిలుస్తారు" అని ఆవిడ చెప్పారు.
ఆవిడ జవాబుతో స్టేషన్ మొత్తం హడావుడి పడింది. కంగారు పడింది. అందరూ కలిసి ఆవిడను సురక్షితంగా ఢిల్లీకి పంపించారు.
అయితే, ఆవిడకు ఏమీ అర్థం కాలేదు.
తన కొడుకును చూసిన తర్వాత ఆవిడ అడిగిన మొదటి ప్రశ్న : "నువ్వు రైల్వేలో ఏం చేస్తావురా" అని.
"నేనా...నేను రైల్వే మంత్రిని...ఓ చిన్నపాటి ఉద్యోగమమ్మా" అని అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి