2014లో, దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో నెల్సన్ మండేలా గౌరవార్థం ముప్పై అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కానీ నెలల తర్వాత, కొందరు సందర్శకులు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. అది ఈనోటా ఆనోటా పాకి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. మండేలా విగ్రహం కుడి చెవిలో కుందేలు బొమ్మేమిటని ప్రభుత్వం ఉలిక్కిపడటమే కాదు, ఆగ్రహం వ్యక్తం చేసింది.
డిసెంబర్ 5న 95 సంవత్సరాల వయసులో మరణించిన వర్ణవివక్ష వ్యతిరేక నాయకుడైన మండేలా విగ్రహం చెవిలో నుంచి కుందేలు బొమ్మను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. "సమగ్రతను పునరుద్ధరించడానికి" ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇంతకూ కుందేలు బొమ్మను విగ్రహంలో పొందుపరిచింది కళాకారులే. తాము ఎంత వేగంతో ఆ విగ్రహాన్ని పూర్తి చేసామో చెప్పడానికన్నట్లుగా తమ వ్యక్తిగత సంతకంలా ప్రతీకాత్మక సూచనగా కళాకారులు చేసిన సూక్ష్మమైన జోడింపు అది. అంతేతప్ప మరొకటి కాదని కళాకారుల మాట.
ఆఫ్రికన్స్‌లో "కుందేలు" అనే పదాన్ని "వేగంగా" అని మాటకు తరచుగా చెప్పుకునే అర్థం.
తాము తక్కువ సమయంలో ఈ విగ్రహాన్ని పూర్తి చేసామనడానికి చిహ్నమే కుందేలు బొమ్మను జోడించామని కళాకారులు రుహాన్ జాన్సే వాన్ వురెన్, ఆండ్రీ ప్రిన్స్ లూ చెప్పారు. అంతేతప్ప తమకెలాంటి దురుద్దేశం లేదని వారు చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. అధిక శాతం ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతకే ప్రభుత్వం తలవొగ్గింది. ఆ కుందేలు బొమ్మ తొలగింపునకు దారి తీసింది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా పాకి సంచలనంగా మారింది. నాడు అందరూ మాట్లాడుకునే ముఖ్యాంశంగా మారిపోయింది.
మండేలా స్మృతి చిహ్నంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. ఆయన మరణించిన 11 రోజుల తర్వాత దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ విగ్రహావిష్కరణ చేసింది. ఈ విగ్రహం
బరువు 4.5 టన్నులు. కళాకారులు ఎంతలా క్షమాపణలు చెప్పినా సరే ప్రభుత్వం ఆ కుందేలు బొమ్మను కళాకారులతోనే తొలగించేలా చేసింది.
తాము నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం "ఇది మేము ఆ విగ్రహాన్ని దేని కోసం ఏర్పాటు చేసామో ఆ ఉద్దేశ్యాన్ని దెబ్బతీసినట్లవుతుంది కనుక తొలగించాం" అని ప్రకటించింది.
హాస్యానికి పేరు గాంచిన మండేలాకు కుందేలు అంటే వినోదం అనిపించవచ్చనే కొందరి సూచనతో ప్రభుత్వం ఏకీభవించలేదు.
మండేలా పూర్తి పేరు నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా. 1918 జూలై 18న జన్మించిన మండేలా 2013 డిసెంబర్ అయిందో తేదీన మరణించారు. ఈయన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు మండేలా. అధ్యక్షుడు కాకముందు ఆయన జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఓ మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో ఆయన కారాగార శిక్షననుభవించారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరైన మండేలా నల్లజాతి సూరీడిగా ఖ్యాతి పొందారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా ఓ సంకేతంగా నిలిచారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి