ఎవరికెరుక..? ఆ భగవంతునికి తప్ప..! :- పోలయ్య కవి కూకట్లపల్లి -అత్తాపూర్....హైదరాబాద్
ఏ ఇళ్లల్లో...
ఎన్ని ఇబ్బందులో 
ఏ కళ్ళల్లో...
ఎన్ని కన్నీళ్ళో... 
ఎన్ని కన్నీటిగాధలో... 

ఏ గుండెల్లో... 
ఎన్ని మానని గాయాలో...
ఏ మనసులో... 
ఎన్ని బాధలో...
ఎన్ని వ్యధలో... 
ఎన్ని మానసిక క్షోభలో...

ఏ కాళ్ళక్రింద... 
ఎన్ని అగాధాలో... 
ఏ జీవితాల్లో... 
ఎన్ని విషాధాలో... 

ఎవరికెరుక..? 
ఆ భగవంతునికి తప్ప..!
కానీ 
నేడు చీకటి రేపు వెలుగు 
నేడు వెలుగు రేపు చీకటి 
నేడు సూర్యుడు అస్తమించేది
రేపు...ఉదయించడానికే...

నేటి వినోదం రేపు విషాదం... 
నేటి విషాదం రేపు వినోదం...
నేటి కన్నీళ్ళు రేపటి ఆనంద భాష్పాలు...
ఇంతే జీవితం...బహు వింతే జీవితం... 



కామెంట్‌లు