ఈ బడిలో బుడిబుడి
నడతల చదువుల
నడవడి పడి పడి
లేచియు పరుగిడి
నుడి కారము దిద్దిన
మనబడి ఈబడి !
చదువుల తల్లి ఒడిలో
మనము గడబిడకలబడి
తడబడి నిలబడి అడుగిడి
నడయాడి నడిచిన
ఈ బడి మనబడి !
అక్షరాలనే బీజములను
తనకడుపున మోసి
వాటినే మొక్కలను చేసి
ఆ మొక్కలని వృక్షాలను
చేసి
ఆ వృక్షాలను ఈ విశ్వానికి
నీడనిచ్చే మహావృక్షాలను
చేసి
తన రూపు మాపు ఈ
మోపున కూడా లేకుండా
కనుమరుగైనది నాబడి
ఈ బడి !
అయినను
మనమున్నాముగా నా
బడి రూపు రేఖలను
మరిచిపోకుండా మరపు
రాకుండా
మరణ మొచ్చువరకు
మరువలేము మిత్రమా!
మనబడి ఈ బడిని!
ఈనాడు ఈ బడి
మరుభూమి అయినది నా బడి
మరణించాక వచ్చి
నా ఒడిలో శాశ్వత నిద్ర పొమ్మంటుంది
నా బడి ఈ బడి మనబడి!
ఎంత వైచిత్రియో కదా ఇదీ
నాడు చదువుల తల్లి సరస్వతీ
అమ్మ ఒడి నా బడి ఈ బడి మనబడి!
నేడు వైకుంఠధామమై
నా వద్ద శాశ్వత
నిద్ర పొమ్మంటుంది
నా బడి ఈ బడి మనబడి!
🙏🙏🙏🙏🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి