నిర్మించేవి కత్తులు కాదు చేతులు
ప్రణయంలో ప్రళయాలు కాదు ప్రాణాలు ఉంటాయి..
మేఘం కార్చే కన్నీరు జగమంతా పారుతుంది.
గగనమంతా విరిసిన ఇంద్రధనస్సు సంఘమంతా సంతోషిస్తుంది.
నిర్వికార శబ్దం ఘీంకారం కాదు ఓంకారం
చరణాలను తాకే అలలు అవి చేతులు
చీల్చబడి విడిపోయేది అంతం కోసం కాదు రెండింతల కోసం.
అల్లుకునే మేనులు వేల వేణువులు
కళ్ళతోనే కలిపే లోకం కనబడేదే..
అంతరించే జాతి కొంతైనా నీ చెంత చేరినట్లే
చెకుముకి నిప్పు రవ్వలు శూన్యంలో చుక్కలు
కైలాసం కోసం మహా పర్వతం నిత్య పరువంతో నిగనిగా లాడుతుంది.
జాడలున్నవి ఫులులు తిరుగుతున్నవి మనిషి తప్పిపోయాడు.
ఎగిరేసిన గాలి విశ్వంతో కలవలేదు.
మిగిలి ఉన్న మట్టి మళ్లీ పుట్టింది ఇప్పుడు మనిషి పుట్టకపోవచ్చు..
ఎదురు పడే ప్రతివాడు ఎదుర్కోలేడు
పిలిచి పిలిచి పిచ్చిదైన వాడు దేవుడు.
కచ్చితంగా చచ్చిపోయేది పచ్చదనం ఎగిరిపోయేది ఎరుపుదనం.
కొనలేని ఊపిరిని కనుక్కునే కాలం కొనవుపిరితో ఉంది.
యుద్ధం అవసరం లేదు సహజ వనరులుంటే చాలు
చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు కంటికి నిద్ర లేదు కాస్త చనుబాలుంటే దానం చేయండి
తప్పిపోయిన తల్లి తప్పకుండా తిరిగి వస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి