రూబిక్స్ క్యూబ్ అనే ఆటవస్తువుతోపైన కాషాయ రంగు, దిగువ ఆకుపచ్చ రంగు, మధ్యలో తెలుపు రంగు వచ్చేలా పేర్చి, జాతీయ జెండాలో త్రివర్ణాలను చూపుతూ తన సృజనాత్మకతను చాటుకున్నాడు ఆ విద్యార్థి.
మండలంలో పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో 8వతరగతి అభ్యసిస్తున్న షేక్ జుబేర్ అను విద్యార్థి ఈ ఆలోచనను రూపొందించాడు.
నడుమన గల తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం అనే సంకేతాన్నిస్తూ నీలంరంగును కుదిర్చి మరీ తన ప్రతిభను ప్రదర్శించాడు. షేక్ జుబేర్ దేశభక్తిని ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, యు.ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు అభినందించారు. విద్యార్థులలో అంతర్గతంగా దాగియున్న కౌశలాలను వెలికితీసి, వారి సామర్ధ్యాలను గుర్తెరిగి ప్రోత్సహించుట ద్వారా సత్ఫలితాలు సాధ్యమని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా వారి అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి