సాహితీ కళా పీఠంసాహితీ కెరటాలు=============కోడికూత కన్నా ముందే నిద్రలేచి...,దంత దావననాదులుపక్కన బెట్టి,...,నాగలి, ములుకర్రచేతబట్టి...ప్రాణసమం గా భావించే పొలంబాట పట్టి..నడుంబిగించి అరకదున్నినాట్లు వేసి నీళ్లు పట్టి..ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే..పొట్టమీరున్న పంట చూసి మురిసిపోయిబిడ్డకి లగ్గం సేసేయవచ్చని సంబరపడే లోపు..ఆలి ఆశపడ్డ నెమలి కంఠంరంగు చీర కొనీయచ్చనితృప్తి పడేలోపువచ్చిందో మహమ్మారీ గాలివాన..ఆశలను ఆవిరిచేసిన జలపాతంలా....జవసత్వాలను మింగేసిన కొండచిలువలా...పంటంతా కళ్ళముందే..జల ప్రవాహంలో కలిసిపోతుంటే..బ్రతుకు భారమై నిర్వేదంలోనిరంతర శ్రమ జీవి!.కుటుంబసభ్యుల కోర్కెలు తీర్చలేక..చావలేక బ్రతలేక నిరాశామయజీవితంలో.కనబడదేదారి....పిలుస్తోందిగోదారి...
నిరంతర శ్రమజీవి:- డా జి భవానీ కృష్ణమూర్తి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి