చిత్ర స్పందన :- ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది

గ్రామ దేవతలకు ఘనమైన బోనము
కల్లు మేకతోని కదిలె జనులు
పోతరాజులాట పోటేత్తి దరువుతో
పల్లె పట్నమంత పరవశంబు

కామెంట్‌లు