అల్లరి పిల్లలు:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
===============
తోట లోని పువ్వులము
గూటిలోని గువ్వలము
కిలకిల నవ్వే పిల్లలము
ఎదురు తిరిగితే పిడుగులము!

ఆకాశంలో చంచమామాతో
ఆడుకుంటాము ఆటలు
పాడుకుంటాము ఎన్నో పాటలు!

బుడిబుడి నడకల బుజ్జాయి
బురదలో అడుగిడకు
అమ్మగాని చూసిందంటే
రమ్మని కేకలేస్తుంది!!

తోటలో మదర మాగిన
మామిడి,జామ సువాసనలతో
నోరూరిస్తూ రమ్మంటున్నాయి
!!

అందరు పిల్లలు రావాలి
కమ్మగ ఆరగించాలి!

అలసి పోయాము ఆడి పాడి
కంటినిండా నిద్దుర పోతాము
ఇంటికి పోయి అందరము!!!



కామెంట్‌లు