బాగుంది కదూ?!:- - యామిజాల జగదీశ్
 జపాన్‌లో, ఏదైనా విరిగిపోయినప్పుడు, దానిని విసిరివేయరు. లేదా సిగ్గుతో దాచరు. దానిని బంగారంతో సరిచేస్తారు.
ఈ అందమైన విధానాన్ని కింట్సుగి అని వ్యవహరిస్తారు. అంటే బంగారు లక్కతో కుండలను మరమ్మతు చేసే కళ. పగుళ్లు ప్రకాశిస్తాయి. దీనిని పరివర్తనకు చిహ్నంగా భావిస్తారు.
మన భావోద్వేగాలతో ఏర్పడిన మచ్చలను మనం అదే విధంగా చూసుకుంటే ఎలా ఉంటుంది?
మీ “పగుళ్లు” మిమ్మల్ని తక్కువ చేయవు. అవి మిమ్మల్ని మరింత మానవీయంగా చేస్తాయి. మరింత వాస్తవికమైనవిగా చేస్తాయి. మరింత ప్రకాశవంతంగా ఉంటాయంటారు జపనీయులు.
కనుక "కింట్సుగి" ని మరచిపోకూడదు. 
మనం ఏదైనా సంఘటనతో ముక్కలైనంత మాత్రాన పలిగిపోకూడదు. మనం ఆ తరుణం నుంచీ అరుదైనదిగా మారుతున్నామన్న మాటగా భావించాలి. బంగారు అతుకులతో కూడిన కళాఖండమవుతాం.

కామెంట్‌లు