క్రమశిక్షణ:- జి.లింగేశ్వర శర్మ
.విద్యాబుద్ధులునేర్వండి
విజ్ఞానమ్మునుపొందండి
సన్మార్గములోనడవండి
సత్కీర్తులనేపొందండి

 క్రమశిక్షణపాటించండి 
క్రమపద్ధతిలోనడవండి
క్రమక్రమముగాయెదగండి 
క్రాంతదర్శులుగమారండి

వ్యక్తిగత క్రమశిక్షణమే
వ్యక్తిత్వమునవికాసమే
వ్యక్తులకునదిభూషణమే 
వ్యక్తముజేయునురూపమే

విద్యార్థులకిదియేముఖ్యం
విద్యార్జనమొందుమార్గం 
విద్యలోనిలుపునున్నతం 
సద్యోగమొసగెడువ్యూహం

క్రమశిక్షణయే లేకున్నను
సమకూరదుగజ్ఞానమ్మును
సాగిపోదుసత్పథమ్మున
బాగుగనీజీవితమ్మును


కామెంట్‌లు