సుప్రభాత కవిత : - బృంద
నిదరోయే నిఖిల జగతిని 
నిశ్శబ్దంగా మేలుకొలుపుతూ 
జ్వలించే సహస్ర జ్యోతుల్లా
జలదరించు మహా ప్రకాశంతో..

సమీపంగా తోచే  సుదూరాన
సుపరిచితంగా అనిపించే
సురుచిర చిర అమర 
సుందర సుమనోహర సుప్రభాసం..

మేదిని ముంగిట ముగ్గులా 
మేరలు ఎరుగని బలిమిలా
మేలిమి ముత్యపు మెరుపులా
మేరువులా వరమిచ్చే వేలుపులా...

తరలివచ్చు తరణి కిరణాల 
తరుణ కాంతుల తళుకులలో 
తనువు తడువగా తపించి
తనివి తీరా తరించిన ధరణి!

కనువిప్పిన కుసుమ బాలల 
కనిపించే కమ్మని వర్ణాలు 
కనువిందుగా మైమరచేలా 
చెప్పే కళకళల కబుర్లు...

ఉదయపు ఉజ్వల కాంతులు 
హృదయంగమంగా అనుభవింప 
నీలపు నింగి పరుగున
నేలకు దిగినట్టు తోచే మేలిపొద్దునకు 

🌸🌸సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు