ఆహా ఏమి సంబంధం...
అద్భుత సంబంధం...
విదేశీ సంబంధం...
వింతైన సంబంధం...!
ఆన్లైన్ వివాహం...
అమ్మాయి అమెరికా..!
కానీ అదంతా
పులి...మేక సంబంధమేనట...
ఏ పులీ… ఏ మేకను పెళ్లాడిన చరిత్ర...
రెండు కలిసి మెలిసి మేసిన రోజే లేదట...
తనను కలవగానే...పులి...
చూపిస్తుందట క్షణంసేపు జాలి...
మరుక్షణమే మేక బ్రతుకు బలి...
అందుకే... జాతకం చూసిన
పూజారి ముందే హెచ్చరించాడట
అబ్బాయి “మేక”ని
అమ్మాయి “పులియ”ని
ఇద్దరికీ పెళ్లి కుదరదని..!
కానీ వియ్యాలవారు...
కయ్యాలవారు...
కయ్యానికి కాలు దువ్వి
పెట్టుడు ముహూర్తంలో
పెళ్లి జరిపించారట..!
అంతే ఇంకేముంది…
శోభనం గదిలో మొదలైన
ఆ మానసిక గృహహింస…
వంటగది వరకూ ప్రాకి...
విడాకులు కొండచరియల్లా
విరుచుకు పడి
ప్రేమ పేలిపోయిందట...
పెళ్లి పెటాకులైందట...
కాపురం కాలిపోయిందట...
కుటుంబం కూలిపోయిందట...
పచ్చని కాపురం…
మున్నాళ్ల ముచ్చటైందట..!
అందుకే ఓ తల్లిదండ్రులారా…
జపాన్...జర్మనీ అమెరికా ఆస్ట్రేలియా
సంబంధాలంటూ ఆశ పడకండి...
విదేశీ సంబంధాలంటూ విర్రవీగకండి...
దూరపు కొండలు నునుపన్న
ఒక నగ్నసత్యాన్ని తెలుసుకోండి...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి