మేమున్న ఇంటికి ముందూ వెనుకా రెండు మామిడి చెట్లు ఉన్నాయి. అఫ్ కోర్స్, ముందు వెనుకా అన్నానే కానీ అవి ఎదురింట, వెనుకింట ఉన్నాయి. అవి జూలై, ఆగస్టు నెలల్లో కాస్తాయి. ఈసారైతే మరీ విరగకాసాయి. వాటిని చూస్తున్నప్పుడల్లా ఓ ఆశ తళుక్కుమంటుంది. రెండు చెట్లలో కాకపోయినా కనీసం ఒక చెట్టు నుంచైనా ఓ కాయ కోయాలని. చిన్న చిన్న పిల్లలయితే బంతి రాయి గట్రా విసురుతుంటారు.
చిన్నపిల్లల్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఓ ఆశ పుడుతుంది.
ఎవరికీ తెలీకుండా ఓ రాయి విసరాలని, ఆ రాయికి తగిలి ఓ మామిడికాయ కింద పడితే దాన్ని ఏరుకుని ఇంట్లోకొచ్చెయ్యాలని.
కానీ వయస్సేమో 71. నేనిప్పుడలా రాయి విసిరి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనని ఓ జంకు. బిడియం కూడా.
అందుకే ఎదురింటావిడను అడిగాను, మీ మేడెక్కి ఒక్కటంటే ఒక్క కాయ కోసుకుంటానని.
అయితే ఆవిడన్నారు కదా..."మీకా కష్టం ఎందుకండీ, నేనే కోసిస్తాను అని.
అబ్బే మీరలా కోసిస్తే నాకానందం లేదు...నేనే కోసుకుంటానని చెప్పగా అందుకావిడ ఒప్పుకున్నారు కానీ ఈ క్షణం వరకూ కోయినే లేదు మామిడికాయ.
అడగడమైతే అడిగాను కానీ అందులో మళ్ళీ బిడియం. ఈ వెధవ బిడియాన్ని మూట కట్టి పారెయ్యాలి ఎక్కడైనా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి