సంస్కారం లేని చదువు:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి) \విశాఖపట్నం

 శాస్త్ర సాంకేతిక పరిస్థితి పెరిగిందని
స్త్రీ పురుష అసమానతలు తొలగి
సమాజాన అందరు చదువుకుంటున్నారన్నది
దేశప్రగతికి కొలమానమా
ఏవి ఆనాటి నైతికవిలువలు కలిగిన విద్య
అన్ని బంధాలు ఆర్థిక బంధాలే
అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నామా?
ఆపదలో ఉన్నవాడికి అభయహస్తమిస్తున్నామా
అరవై ఏండ్లనాటి అనురాగ ఆప్యాయతల పిలుపులు
విక్టర్ అన్న, రహీమ్ బాబాయ్, చేనులు తాత అన్నవి కనుమరుగవడం
కులమత భేదాలు, పేదగొప్ప తారతమ్యాలు
పెదవి పై వచ్చేమాట హృదయంలోంచి గాక పోవడం
పసిపిల్లలనుంచి పండుముదుసుల  వారిపై జరిగే పాశవిక చర్యలు 
మలమూత్రాదులను తుడిచి
తాము తిన్నా తినకపోయినా పిల్లల కడుపునింపిన 
పరదేవతా స్వరూపులయిన
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చూడక చేర్చిన సంఘటనలు చూస్తుంటే
చదువుకు సంస్కారం  సంబంధం ఉన్నదా అనిపించక మానదు
సంస్కారంలేని చదువు వ్యర్థమే.....!!
..........................

కామెంట్‌లు